తేది: 09-09-2025, మంగళవారము రోజున హసన్ పర్తిలోని గ్రీన్ వుడ్ హైస్కూల్ లో సాయంత్రం 4 గంటలకు, కవి కాళోజీ నారాయణ రావుగారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.


ఇట్టి కార్యక్రమానికి పాఠశాల డైరెక్టరు గారు శ్రీ డా. గిర్రెం భరద్వాజ నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. వారిని 8వ తరగతికి చెందిన విద్యార్థులు డైరెక్టరు గారికి శాలువా కప్పి పూర్ణకుంభంతో వేదమంత్రాల మధ్య వేదిక పైకి ఆహ్వానించడం జరిగింది. మొదటగా డైరెక్టరుగారు కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి, పూలమాలవేసి, వారికి అంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమాన్ని విద్యార్థినులు భరత నాట్యంతో ప్రారంభించారు.



8 మరియు 9 తరగతులకు చెందిన 20 మంది విద్యార్థులు వేదికపై నుండి మహాభారతంలోని పద్యాలు ముక్త కంఠంతో పాడారు. తరువాత తెలుగుభాషా ఉపాధ్యాయుడైన కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి గారు కవి కాళోజీ గారి గురించి విద్యార్థినీ, విద్యార్థులకు చక్కగా వివరించారు. తెలంగాణ భాషా- సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు మరియు వాటి విశిష్టతను గురించి తెలుగుభాషా ఉపాధ్యాయుడైన కిరణ్ గారు ఎంతో చక్కగా వివరించారు.


తెలంగాణ రాష్ట్ర గీతమైన ” జయజయహే తెలంగాణ” అను పాటకు, బతుకమ్మ, బోనాలు మొదలైన పాటలకు విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో చక్కగా ఆడి పాడారు. మరికొంతమంది విద్యార్థినులు ” ఉమ్మడి కుటుంబం దాని ఆవశ్యకత” అనే అంశం పై చక్కటి నాటకాన్ని ప్రదర్శించటం జరిగింది. 4, 5 మరియు 6వ తరగతులకు చెందిన పిల్లలు వేమన, సుమతి, భాస్కర మొదలైన నీతి శతకాలలోని పద్యాలను రాగాలాపనతో పాడి భావము చెప్పారు. కొన్ని జాతీయాలు , సామెతలు విద్యార్థులను అడగడం జరిగింది.










చివరగా డైరెక్టరు శ్రీ డా. గిర్రెం భరద్వాజ నాయుడు గారు మాట్లాడుతూ కాళోజీ గారి గురించి వారికి తెలంగాణ భాష పట్ల ఉన్న మమకారము గురించి, వారు చేసిన ఉద్యమాలగురించి, వారి కొన్ని రచనల గురించి విద్యార్థులకు తెలియపర్చారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు భాషా ఉపాధ్యాయులైన జంపాల రమేష్, కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, కిరణ్, సుభాషిణి, రాధిక, కవిత, సునిత మరియు కరుణలను అభినందించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతగానో మెచ్చుకున్నారు.

ఇట్టి కార్యక్రమమునకు పాఠశాల ప్రిన్సిపల్స్ వి.వి.వి నవీన్ కుమార్, టి. పవన్ కుమార్ గార్లు . పాఠశాల జనరల్ మేనేజర్ గారైన ఎ. ప్రభు కుమార్ గారు. వైస్ ప్రిన్సిపల్ వి. సురేష్ కుమార్ ఎ.సి.ఒ కాంతి, ఫణీంద్ర గార్లు పాఠశాల ఫైనాన్షియల్ ఆఫీసర్ షేక్ రబ్బానీ గారు . ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు